download: Pdficon.png
Odticon.png
Version: 1.4

దేవుని కథ (ఐదు వేళ్ళు)

దేవుడు మీ జీవితానికి గొప్ప ప్రణాళికలు కలిగియున్నాడు

Hand 1.png

(బ్రొటన వేలు : చాలా ముఖ్యమైనది)

  • దేవుడు నీ పట్ల ఆశక్తిగా ఉన్నాడు. నీవు ఆయనకు చాలా విలువైనవాడవు.
  • ఆయన నీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు. ప్రశ్న: దానితో నీవు ఏమి చేస్తావు?

సమస్య: మనము ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో అది మనము చేయం

Hand 2.png

(చూపుడు వేలు : ఇతరులపై వేలెత్తి చూపి వారిని నిందిస్తాం, కానీ సమస్య మనలో ఉంది.)

  • మన జీవితాలలో ఒక పెద్ద సమస్య ఉంది : పాపం
  • పాపము అంటే ఏమిటి? : దొంగతనం చేయటం, అబద్ధాలాడడం, హత్యలు చేయడం …

(పది ఆజ్ఞలు అతిక్రమించడం) వంటివి పాపములు.

  • అయితే దేవుని దృష్టిలో పాపము ఇంకా ఎక్కువ ప్రామాణికమైనది.
    • ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం పాపము.
    • ఏ విషయములోనైనా సరైనది, మంచిది ఏదో తెలిసి కూడా అది చేయకపోవడం కూడా పాపమే.
    • పాపమునకు మూలము: మనము దేవుని కంటే గొప్ప అనుకోవడం, ఆయనను మరియు ఆయన ప్రేమను తిరస్కరించడం.
  • మనం పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కానీ మన పాపములు మనల్ని కృంగదీసి, ఆత్మీయముగా చంపివేసి, దేవుని నుండి దూరం చేస్తాయి.
  • దేవుడు మన పాపములను బట్టి తీర్పు తీరుస్తాడు ఎందుకంటే న్యాయం లేదా తీర్పు అంటే దాని అర్ధం ప్రతి చర్యకి పర్యవసానం ఉంటుందని.

దేవుని పరిష్కారం: యేసు క్రీస్తు మన పాపములకు పరిహారం చెల్లించాడు.

Hand 3.png

(మధ్య వేలు అన్నిటికంటే పొడవైనది: యేసు చనిపోయిన సిలువకు అది గుర్తు.)

  • ఇది ఎలా సాధ్యం? దేవుడు ప్రేమామయుడుగా అదే సమయములో పాపమును శిక్షించే న్యాయమూర్తిగా ఎలా ఉండగలరు?
  • దేవుని కుమారుడైన యేసు క్రీస్తు మాత్రమే దేవుని గొప్ప పరిష్కారం.
    • యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి, పరిపూర్ణమైన జీవితము జీవించి ఎంతో మందికి స్వస్థత కలుగజేశారు.
    • ఆయన శత్రువులు బంధించి, కొట్టి, శిలువపైన చంపేశారు.
    • కానీ మూడు రోజుల తరువాత ఆయన మరణము నుండి తిరిగి లేచారు.
    • మన పాప క్షమాపణ కొరకు ఆయన శిక్ష అనుభవించారు.
  • ఇక్కడ ఇద్దరు కవలలు కథ ఉపయోగించుకోండి.

దేవుడు మనతో సంబంధం కలిగియుండాలని కోరుకుంటున్నారు.

Hand 4.png

(ఉంగరం వేలు: దేవునితో సంబంధం)

  • దేవుడు మనతో దగ్గర సంబంధం కలిగి మనకు నిత్యజీవితం అనే బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు - అది మనము స్వీకరించాలి.
  • అది ఎలా పని చేస్తుంది? ఆయనను విశ్వసించి, ఆయన ఇస్తున్న బహుమతిని మనం స్వీకరిస్తున్నట్లు అంగీకరించాలి.
  • అయితే ఆ నిర్ణయానికి కొన్ని పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని మనము తెలుసుకోవాలి. దాని అర్ధం, మన పాత జీవితాన్ని వదిలిపెట్టి దేవుడు మనం ఎలా జీవించాలనుకుంటున్నారో ఆలా మన జీవితాన్ని మార్చుకోవడం.
  • ఉదాహరణకు, పెళ్ళిలో వధువుకు “అవును” అని చెప్పడం. ఒక్కసారి దేవునితో “సరే, నిన్ను నమ్ముతాను” అని చెబితే దేవుడు కూడా మీతో “సరే” అని చెబుతారు. ఆయన మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీకు కావాల్సినవి అనుగ్రహించి మీతో జీవించాలని కోరుకుంటున్నారు.

పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తారు.

Hand 5.png

(చిటికెన వేలు: దేవునిలో ఎదగడానికి కావాల్సిన శక్తి ఉన్నది)

  • దేవుడు మీకొరకు ఎంతో కలిగి ఉన్నారు! దేవుని గురించి తెలుసుకొని, మన కొరకు ఆయన కలిగియున్న అద్భుతమైన ప్రణాళికలు అనుభవించడం ఎంతో ఆనందాన్నిస్తుంది.
  • కానీ ఈ ప్రయాణంలో మన సొంత బలం మీద ఆధారపడితే మనం మరల మరల పాపములో పడిపోతూ ఉంటాం.
  • పరిశుద్ధాత్మ అంటే మనకు గల "దేవుని శక్తి" . ఆయన మనకు నేర్పిస్తారు, మన బలహీనతలను సవరిస్తారు మరియు మనం ఒక మంచి మనిషిగా ఉండటానికి సహాయం చేస్తారు.
  • పరిశుద్ధాత్మ కలిగిన ఇతరులు కూడా మనకు సహాయం చేస్తారు, దేవుడిని బాగా అర్ధం చేసుకోవడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారు సహాయం చేస్తారు.

ఇద్దరు కవలలు

ఒకప్పుడు ఇద్దరు కవలలు ఉండేవారు. వారిలో ఒకరు యుక్త వయసులో ఉండగా చెడ్డ దారిలోకి వెళ్ళిపోయాడు. కుటుంబాన్ని వదిలేసి ఒక ముఠా లో చేరాడు. చివరికి ఒక హంతకుడుగా మారాడు. తన దారికి అడ్డు వస్తున్నాడని రోడ్డు మీద ఒకరిని కాల్చి చంపేశాడు. ఆ కేసులో కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో కొన్ని దశాబ్దాల తర్వాత తన సోదరుడిని చూసాడు. ఆ సోదరుడు ఇప్పుడు ఆ కోర్టులో న్యాయమూర్తి. అది చూసిన వెంటనే మొదట్లో ఆనందంతో "ఇతను నా సహోదరుడే " అనుకున్నాడు. "నన్ను అతడు ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు! నన్ను ఖచ్చితముగా ఇక్కడనుండి బయట పడేస్తాడు " అని అనుకున్నాడు.
అప్పుడు న్యాయమూర్తి అయిన తన సహోదరుడు "మరణ శిక్ష" అని తీర్పు చెప్పాడు. ఆ కవల సోదరుడు చాలా కోప్పడ్డాడు. "అంత కఠిన శిక్షా? అది ప్రేమ కాదు " అని అన్నాడు. కానీ ఆ న్యాయమూర్తి చట్టప్రకారం తీర్పు చెప్పాలి.

ఆ శిక్ష పడ్డ కవల సోదరుడు జైలులో ఉండగా, ఆ రోజు మధ్య రాత్రి తన తలుపు తెరుచుకుంది. న్యాయమూర్తి అయిన తన సోదరుడు వచ్చాడు. అతడిని చూసిన వెంటనే కోప్పడ్డాడు, "నాకు ఎందుకు మరణ శిక్ష వేసావ్ " అని గద్దించాడు.
దానికి ఆ సోదరుడు, "నేను న్యాయమూర్తిని, అది నా కర్తవ్యం, కానీ నా దగ్గర ఒక సలహా ఉంది. మనమిద్దరం ఒకేలా ఉంటాం కాబట్టి మన బట్టలు మార్చుకుందాం. అప్పుడు నేను ఇక్కడ ఉంటాను, నువ్వు బయటకు వెళ్లిపోవచ్చు" అన్నాడు.
దానికి ఆ సోదరుడు అంగీకరించి జైలునుండి బయటపడ్డాడు. ఆ రాత్రంతా చాలా సంతోషంతో సంబరాలు చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతనికి గుర్తువచ్చింది, "మరణ శిక్ష ఉదయం 9 గంటలకు షెడ్యూల్ చేయబడింది" .. అతడు పరుగెత్తుకుని జైలుకి వెళ్ళాడు, ఆ జైలు గోడల దగ్గరకు రాగానే తుపాకీ కాల్పుల శబ్దం విన్నాడు. తన సోదరుడు నిజంగానే తను అనుభవించాల్సిన శిక్షణను అనుభవించాడు. అతడు చాల భాధ పడ్డాడు. తన సోదరుడి ఇంటికి వెళితే ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్లో ఇలా వ్రాసి ఉంది..

"నీవు ఇప్పుడు విడుదల పొందావు. నీ శిక్షను నేను అనుభవించాను. నేను నీకు చేసింది గుర్తుండేలా, ఇకనుండి నిజాయితీగా నా జీవితాన్ని నీవు బ్రతుకు. "


దేవుడు ఇస్తున్న ఈ బహుమతికి నా సమాధానం

దేవుడు తన పని పూర్తిచేసాడు. ఇప్పుడు మీ వంతు...

దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను అంగీకరించానా?
□ అవును □ కాదు
నిత్య జీవితము పొందుకుంటాను అని నేను ఖచ్చితముగా చెప్పగలనా?
□ అవును □ కాదు
నా పాపములను, చెడ్డ అలవాట్లను వదిలిపెట్టానా?
□ అవును □ కాదు
పరిశుద్దాత్మను నేను నిశ్చయముగా పొందుకున్నానా?
□ అవును □ కాదు


దేవుడిని అంగీకరించడానికి ఎలా ప్రార్ధన చేయాలి

  • దేవుడా, నేను మీతో మాట్లాడగలుగుతున్నందుకు మీకు వందనములు. నేను మీ చిత్త ప్రకారం జీవించలేదని నాకు అర్ధమైంది. నన్ను క్షమించండి. దయచేసి నాకు క్షమాపణ దయచేయండి.
  • యేసు ప్రభువా, నా కోసం మీరు చనిపోయినందుకు మీకు వందనములు. నేను మిమ్మల్ని నా రక్షకునిగా, ప్రభువుగా అంగీకరిస్తున్నాను.
  • నేను నా జీవితాన్ని మార్చుకుని, మీకు ఇష్టం లేని వన్నీ వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మీ గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇకనుండి మీ చిత్త ప్రకారం జీవించాలని కోరుకుంటున్నాను.
  • పరిశుద్ధాత్మ దేవా, నాకు మీరు సహాయం చేయండి. నన్ను ఆత్మీయముగా శుభ్రపరచి నన్ను మీ ఆత్మతో నింపండి.



తర్వాత ఏమి చేయాలో దేవుడిని అడగండి

Here you find suggestions for a conversation with God. Add everything that is on your heart and that you want to tell God. If you feel unsure about certain points, you can tell that to God honestly. Use the support of someone who has experience in talking with God.

ప్రభువా, నా జీవితములో మీకు నచ్చనివి ఏమిటి? ఏ ఏ విషయములలో నేను మారాలి?


God, I thank You that I can talk with You. I realize that I didn’t live according to Your will. I’m sorry. Please forgive me that I _______________ (name what God showed you).

Jesus, I thank You that You made a solution and that You died for me. I’m ready to change my life and get rid of everything You call sin. I want to live according to Your will.

Holy Spirit, please help me with that. Cleanse me and fill me.

If you can say all this from your heart then let someone explain to you how the start of this new life works (see “Baptism” worksheet).