Translations:God's Story/17/te
మానవాళితో దేవుని కథ ఖచ్చితముగా చాలా సుదీర్ఘమైనది మరియు అంతులేనిది. ఇక్కడ ఆ ప్రయాణములో ముఖ్యమైన భాగములపై దృష్టిసారించాలనుకుంటున్నాము. ఈ విషయాలు మీరు ఇతరులతో పంచుకున్నప్పుడు వారు అర్ధం చేసుకుని, వారి జీవితాలపై ప్రభావం చూపాలన్నదే మా లక్ష్యం. అయితే మీరు ఎవరికైతే చెబుతున్నారో వారి నేపథ్యాన్ని బట్టి ఆ పంచుకునే విషయములో చాలా తేడా ఉండొచ్చు. వారికి ఇప్పటికే ఏమి తెలుసు? ఏ ఏ విషయాలు వారికి పూర్తిగా కొత్తవి ?