Translations:God's Story (first and last sacrifice)/22/te
- దేవుడు వారిని ఇంకా ప్రేమిస్తున్నాడు అందుకే ఒక అద్భుత కార్యాన్ని చేసారు. ఆకులతో చేసిన బట్టలు కాకుండా వారికి జంతువు చర్మంతో చేసిన బట్టలు ఇచ్చారు.
- ఆదాము మరియు హవ్వల పాపము పరిహారం కొరకు, సిగ్గు కప్పుకోవడానికి ఒక జంతువు బలి అవ్వాల్సివచ్చింది.
- ఈ మొట్టమొదటి బలి దేవుడు సమకూర్చాడు. తరువాత కాలంలో చాలామంది ప్రవక్తలు కూడా బలులు అర్పించారు. నోవాహు, అబ్రాహాము (ఇబ్రహీం), మోషే (మూసా), దావీదు (దావూద్) మొదలగువారు.
- మనందరికోసం ఒక ప్రత్యేకమైన బలిని పంపించబోతున్నాని దేవుడు వాగ్దానం చేశారు.
- అతడు పాపమును జయించి మనందరినీ మరల దేవుని దగ్గరకు చేరుస్తాడని, ఈ రాబోయే మెస్సయా గురించి చాలా ప్రవచనాలు కూడా వివరించాయి.