Translations:God's Story (first and last sacrifice)/23/te

  • మరియ (మెరియం) అనే కన్యకు యేసు జన్మించారు. ఆయనను “మెస్సయా”, “దేవుని వాక్యము” అని పిలిచేవారు.
  • ఆయన ప్రజలను ఎంతో ప్రేమించారు, ఎప్పుడు పాపము చేయలేదు, ఎవరిని చంపలేదు, ఆయనకంటూ ఆస్తులు కూడబెట్టుకోలేదు.
  • ఆయన ఎన్నో గొప్ప అద్భుతకార్యాలు చేశారు, ఎంతోమంది రోగులను బాగుచేసారు, దయ్యాలను వెళ్లగొట్టారు, చనిపోయిన వారిని తిరిగి లేపారు.
  • చెడు మార్గములు విడిచిపెట్టి దేవుని దృష్టిలో మేలైన మార్గములో నడవాలని, దేవుడు మనం ఎలా జీవించాలని కోరుకుంటున్నారో ఆ విషయాలు యేసు నేర్పించారు.
  • "ఆశక్తికరమైన విషయం": ఆయన యుక్తవయసులో ఉండగానే "నేను మరణించి తిరిగి లేస్తాను" అని ప్రవచించారు.
  • యోహాను(యాహ్యా) ప్రవక్త కూడా యేసుని చూచి "ఇదిగో, దేవుని గొఱ్ఱెపిల్ల" అన్నారు. (ఎంత అద్భుతం కదా! గొఱ్ఱెపిల్ల బలికి ఉపయాగించబడుతుంది. యేసే ఆ బలియైన గొఱ్ఱెపిల్ల)