Translations:God's Story (five fingers)/15/te
- దేవుడు మనతో దగ్గర సంబంధం కలిగి మనకు నిత్యజీవితం అనే బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు - అది మనము స్వీకరించాలి.
- అది ఎలా పని చేస్తుంది? ఆయనను విశ్వసించి, ఆయన ఇస్తున్న బహుమతిని మనం స్వీకరిస్తున్నట్లు అంగీకరించాలి.
- అయితే ఆ నిర్ణయానికి కొన్ని పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందని మనము తెలుసుకోవాలి. దాని అర్ధం, మన పాత జీవితాన్ని వదిలిపెట్టి దేవుడు మనం ఎలా జీవించాలనుకుంటున్నారో ఆలా మన జీవితాన్ని మార్చుకోవడం.
- ఉదాహరణకు, పెళ్ళిలో వధువుకు “అవును” అని చెప్పడం. ఒక్కసారి దేవునితో “సరే, నిన్ను నమ్ముతాను” అని చెబితే దేవుడు కూడా మీతో “సరే” అని చెబుతారు. ఆయన మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీకు కావాల్సినవి అనుగ్రహించి మీతో జీవించాలని కోరుకుంటున్నారు.