Translations:God's Story (five fingers)/20/te

ఒకప్పుడు ఇద్దరు కవలలు ఉండేవారు. వారిలో ఒకరు యుక్త వయసులో ఉండగా చెడ్డ దారిలోకి వెళ్ళిపోయాడు. కుటుంబాన్ని వదిలేసి ఒక ముఠా లో చేరాడు. చివరికి ఒక హంతకుడుగా మారాడు. తన దారికి అడ్డు వస్తున్నాడని రోడ్డు మీద ఒకరిని కాల్చి చంపేశాడు. ఆ కేసులో కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో కొన్ని దశాబ్దాల తర్వాత తన సోదరుడిని చూసాడు. ఆ సోదరుడు ఇప్పుడు ఆ కోర్టులో న్యాయమూర్తి. అది చూసిన వెంటనే మొదట్లో ఆనందంతో "ఇతను నా సహోదరుడే " అనుకున్నాడు. "నన్ను అతడు ఇంకా ప్రేమిస్తూనే ఉంటాడు! నన్ను ఖచ్చితముగా ఇక్కడనుండి బయట పడేస్తాడు " అని అనుకున్నాడు.
అప్పుడు న్యాయమూర్తి అయిన తన సహోదరుడు "మరణ శిక్ష" అని తీర్పు చెప్పాడు. ఆ కవల సోదరుడు చాలా కోప్పడ్డాడు. "అంత కఠిన శిక్షా? అది ప్రేమ కాదు " అని అన్నాడు. కానీ ఆ న్యాయమూర్తి చట్టప్రకారం తీర్పు చెప్పాలి.