Translations:God's Story (five fingers)/21/te

ఆ శిక్ష పడ్డ కవల సోదరుడు జైలులో ఉండగా, ఆ రోజు మధ్య రాత్రి తన తలుపు తెరుచుకుంది. న్యాయమూర్తి అయిన తన సోదరుడు వచ్చాడు. అతడిని చూసిన వెంటనే కోప్పడ్డాడు, "నాకు ఎందుకు మరణ శిక్ష వేసావ్ " అని గద్దించాడు.
దానికి ఆ సోదరుడు, "నేను న్యాయమూర్తిని, అది నా కర్తవ్యం, కానీ నా దగ్గర ఒక సలహా ఉంది. మనమిద్దరం ఒకేలా ఉంటాం కాబట్టి మన బట్టలు మార్చుకుందాం. అప్పుడు నేను ఇక్కడ ఉంటాను, నువ్వు బయటకు వెళ్లిపోవచ్చు" అన్నాడు.
దానికి ఆ సోదరుడు అంగీకరించి జైలునుండి బయటపడ్డాడు. ఆ రాత్రంతా చాలా సంతోషంతో సంబరాలు చేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతనికి గుర్తువచ్చింది, "మరణ శిక్ష ఉదయం 9 గంటలకు షెడ్యూల్ చేయబడింది" .. అతడు పరుగెత్తుకుని జైలుకి వెళ్ళాడు, ఆ జైలు గోడల దగ్గరకు రాగానే తుపాకీ కాల్పుల శబ్దం విన్నాడు. తన సోదరుడు నిజంగానే తను అనుభవించాల్సిన శిక్షణను అనుభవించాడు. అతడు చాల భాధ పడ్డాడు. తన సోదరుడి ఇంటికి వెళితే ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్లో ఇలా వ్రాసి ఉంది..