Translations:God's Story (five fingers)/22/te
దేవుడిని అంగీకరించడానికి ఎలా ప్రార్ధన చేయాలి
- దేవుడా, నేను మీతో మాట్లాడగలుగుతున్నందుకు మీకు వందనములు. నేను మీ చిత్త ప్రకారం జీవించలేదని నాకు అర్ధమైంది. నన్ను క్షమించండి. దయచేసి నాకు క్షమాపణ దయచేయండి.
- యేసు ప్రభువా, నా కోసం మీరు చనిపోయినందుకు మీకు వందనములు. నేను మిమ్మల్ని నా రక్షకునిగా, ప్రభువుగా అంగీకరిస్తున్నాను.
- నేను నా జీవితాన్ని మార్చుకుని, మీకు ఇష్టం లేని వన్నీ వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మీ గురించి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇకనుండి మీ చిత్త ప్రకారం జీవించాలని కోరుకుంటున్నాను.
- పరిశుద్ధాత్మ దేవా, నాకు మీరు సహాయం చేయండి. నన్ను ఆత్మీయముగా శుభ్రపరచి నన్ను మీ ఆత్మతో నింపండి.